లక్నో: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థల అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయ పార్టీల్లో చేరడం, వారికి టికెట్లు ఇవ్వడంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో స్వతంత్ర సంస్థల విశ్వసనీయతపై అనుమానం వస్తున్నదని పేర్కొన్నారు. అధికారులకు టికెట్లు ఇస్తే ప్రజలకు ఆ సంస్థలపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు జరిపేందుకు ఇలాంటి సంస్థల అధికారులను బీజేపీ వాడుకుని, ఎన్నికలప్పుడు వారికి టికెట్లు ఇస్తున్నదని దుయ్యబట్టారు. యూపీ ఎన్నికల్లో శివసేన 50 నుంచి 60 స్థానాల్లో పోటీచేస్తుందని వెల్లడించారు.