Google Maps | సుదూర ప్రాంతాలకు, కొత్త ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఆ రూట్తోపాటు వేగం తెలుసుకోవడానికి ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ ఇక ఫ్యూయల్ పొదుపు చేయడంలోనూ సహాయ పడనున్నది. ప్రయాణంలో ఫ్యుయల్ పొదుపు చేయడానికి గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తెచ్చింది. ‘ఫ్యుయల్ సేవింగ్’ అనే పేరుతో యూజర్లకు ఈ ఫీచర్’ను గూగుల్ పరిచయం చేసింది. ఇప్పటికే అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు, కెనడాల్లో వినియోగంలో ఉన్న ఈ ఫీచర్ ఇక భారత్లో అందుబాటులోకి తెచ్చింది.
ఈ గూగుల్ మ్యాప్స్ ‘ఫ్యూయల్ సేవింగ్స్’ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే.. మనం వెళ్లే రూట్లో లైవ్ ట్రాఫిక్ అప్ డేట్, రహదారులు, ట్రాఫిక్ పరిస్థితులు, ఇంధన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. వాహన వేగం, ఫ్యుయల్ వాడకం రెండింటిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుకూల రూట్ చూపుతుంది. అలాగే ఆ రూట్ లో వెళ్లడం వల్ల ఎంత ఫ్యుయల్ పొదుపు చేయొచ్చో చూపుతుంది.
గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.. అటుపై ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నేవిగేషన్ సెట్టింగ్స్’ ఎంచుకుని.. కిందకు స్క్రోల్ చేయాలి. అక్కడ కనిపించే ‘రూట్ ఆప్షన్’ అనే ట్యాబ్’లో ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్’ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అటుపై మీ వాహనం ఇంజిన్, ఫ్యుయల్ రకం ఎంచుకోవాలి. నేవిగేసన్ ట్యాబ్ లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వాహన వేగంతోపాటు మీరు వెళ్లే రూట్లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చూపుతుంది.