Aadhaar Biometric lock | బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ప్రారంభించాలన్నా.. పిల్లలు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలన్నా.. బీపీఎల్ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. కొత్త మొబైల్ సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఆధార్‌తోపాటు ఫింగర్ ప్రింట్ కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. అవసరం ఉన్న ప్రతి చోటా ఆధార్, ఫింగర్ ప్రింట్ ఇస్తాం.. దీన్ని అదునుగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు భారీ మోసాలకు తెర తీస్తున్నారు. వేర్వేరు మార్గాల్లో పౌరుల ఫింగర్ ప్రింట్స్ సేకరించి, నగదు స్వాహా చేస్తున్నారు. ఈ మోసాల నుంచి బయట పడేందుకు ఆధార్ కార్డుతో రికార్డు చేస్తున్న ఫింగర్ ప్రింట్ వంటి బయోమెట్రిక్ అథంటికేషన్ లాక్ చేసుకోవడం బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవసరమైనప్పుడు అన్ లాక్ చేసుకోవచ్చు. ఇలా బయోమెట్రిక్ లాక్ చేయడం వల్ల మీ ప్రమేయం లేకుండా ఇతరులు మీ బయో మెట్రిక్ వినియోగించడం సాధ్యం కాదు.. ఈ లాక్ లేదా అన్ లాక్ ప్రక్రియ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..
ముందుగా మై ఆధార్ పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేసి.. వచ్చే ఓటీపీ సాయంతో లాగిన్ కావాలి. స్క్రీన్ మీద లాక్ లేదా అన్ లాక్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. లాక్, అన్ లాక్ ఆప్షన్లు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై వివరణ ఉంటుంది. ఆ పేజీలో నెక్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
అక్కడ ప్లీజ్ సెలెక్ట్ టు లాక్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కింద ఉండే టర్మ్ బాక్స్ లో టిక్ చేసి నెక్ట్స్ ఆప్షన్ మీద క్లియ్ చేయాలి. అప్పుడు స్క్రీన్ మీద ‘మీ బయో మెట్రిక్ విజయవంతంగా లాక్ చేయబడింది’ అనే సందేశం డిస్ ప్లే అవుతుంది. అలా మీ ఆధార్ బయో మెట్రిక్ లాక్ కాగానే లాక్ లేదా అన్ లాక్ బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ కనిపిస్తుంది.
పోర్టల్ లాగిన్ కాగానే లాక్, అన్ లాక్ బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగులో కనిపించే లాక్ తొలగించాలంటే .. ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ టర్మ్ బాక్స్ టిక్ చేయగానే మీ బయో మెట్రిక్ అన్ లాక్ తాత్కాలికమా.. శాశ్వతమా.. అని అడుగుతుంది. అలా మీకు అవసరమైన ఆప్షన్ ఎంచుకుని, నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీ బయో మెట్రిక్ విజయవంతంగా అన్ లాక్ అయింది అనే మెసేజ్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.