Honor X7b | గ్లోబల్ మార్కెట్లో హానర్ ఎక్స్7బీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Honor X7b | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్.. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో హానర్ ఎక్స్7బీ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
Honor X7b | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) శుక్రవారం గ్లోబల్ మార్కెట్లోకి తన చౌక స్మార్ట్ ఫోన్ హానర్ ఎక్స్7బీ (Honor X7b) ఫోన్ ఆవిష్కరించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్7.2 వర్షన్‌పై పని చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్‌తో వస్తోంది. 6.8 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగి ఉంటుంది. హానర్ ఎక్స్7బీ (Honor X7b) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో వస్తున్నది. 35 వాట్ల చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
ఎమరాల్డ్ గ్రీన్ (Emerald Green), ఫ్లోయింగ్ సిల్వర్ (Flowing Silver), మిడ్ నైట్ బ్లాక్ (Midnight Black) కలర్ ఆప్షన్లు ఉంటాయి. అయితే, భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్నది హానర్ వెల్లడించలేదు. హానర్ ఎక్స్7బీ ఫోన్ 249 డాలర్లు పలుకుతుందని తెలుస్తోంది.
హానర్ ఎక్స్7బీ (Honor X7b) ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 7.2 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2412 పిక్సెల్స్) టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ కలిగి ఉంటుంది.
108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఎఫ్/1.75 అపెర్చర్, 5-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ ఎఫ్/2.2 అపెర్చర్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ విత్ ఎఫ్/2జ4 అపెర్చర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ రిజొల్యూషన్ విత్ ఎఫ్/2.0 అపెర్చర్ కలిగి ఉంటుంది.
హానర్ ఎక్స్7బీ ఫోన్ 128 జీబీ ఆఫ్ ఇన్ బిల్ట్ స్టోరేజీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-పై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ కలిగి ఉంది. 2.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంది. 35 వాట్ల హానర్ సూపర్ చార్జ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

