కోటి యూనిట్లు అమ్ముడైన మోడల్
న్యూఢిల్లీ: హోండా మోటర్‌సైకిల్‌కు చెందిన షైన్ విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. 125 సీసీ సెగ్మెంట్లో విడుదలైన ఈ బైకు ఇప్పటి వరకు కోటి యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. 2006లో దేశీయ మార్కెట్లోకి విడుదలైన ఈ బైకు..2010 నాటికి 10 లక్షల యూనిట్లు, 2014 నాటికి 30 లక్షల యూనిట్లు, 2017 నాటికి 50 లక్షల యూనిట్ల మైలురాయికి చేరుకున్నది. 2020లో 90 లక్షల యూనిట్ల మైలురాయికి చేరుకున్న ఈ బైకు..2022 నూతన సంవత్సరంలో కోటి మైలురాయికి చేరుకొని చరిత్రను సృష్టించింది.