న్యూఢిల్లీ, మే 19: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా..మరో స్పోర్ట్ బైకును పరిచయం చేసింది. రెబల్ 500 క్రూజర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధర రూ.5.12 లక్షలుగా నిర్ణయించింది. 471 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు ట్విన్ ఇంజిన్, ఆరు గేర్‌బాక్స్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ బైకును బుకింగ్ చేసుకున్న వారికి వచ్చే నెల చివరి నుంచి డెలివరి చేయనున్నట్టు ప్రకటించింది. ఈ బైకు గురుగ్రామ్, ముంబై, బెంగళూరులలో ఉన్న బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల్లో మాత్రమే లభించనున్నది.