Honda Motorcycle & Scooters | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) 2024లో మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయంలో గణనీయ వృద్ధిరేటు నమోదు చేసింది. 2023తో పోలిస్తే, 2024లో 32 శాతం వృద్ధితో 58,01,498 యూనిట్లు విక్రయించింది. వాటిలో 52,92,976 యూనిట్లు దేశీయంగా విక్రయిస్తే, 5,08,522 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేసినట్లు హెచ్ఎంఎస్ఐ తెలిపింది. గత నెలలో 3,08,083 యూనిట్లు విక్రయిస్తే, వాటిలో దేశీయంగా 2,70,919 యూనిట్లు అమ్ముడయ్యాయి. విదేశాలకు 37,164 మోటారు సైకిళ్లు, స్కూటర్లు ఎగుమతి చేసినట్లు పేర్కొంది.