Honda Elevate | జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ (Honda Cars) భారత్ మార్కెట్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలివేట్ ఎస్యూవీ (Elevate SUV) ఆవిష్కరించింది. తద్వారా మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్తోపాటు సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ మోడల్ కార్లకు ఎలివేట్ గట్టి పోటీ ఇవ్వనున్నది. దీని ధర రూ.10.99 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభం అవుతుంది.
ఎలివేట్ ఎస్యూవీ నాలుగు వేరియంట్లు – ఎస్వీ, వీ, వీఎక్స్, జడ్ఎక్స్ వేరియంట్లలో లభిస్తుంది. వాటిల్లో ఎస్వీ మినహా అన్నీ మాన్యువల్ (ఎంటీ) / సీవీటీ ట్రాన్స్ మిషన్ (సీవీటీ) ఆప్షన్లలో లభిస్తుంది.
ట్రాన్స్ —- ఎస్వీ —– వీ —– వీఎక్స్ —- జడ్ఎక్స్
మిషన్ — రూ. లక్షల్లో — రూ. లక్షల్లో —- రూ. లక్షల్లో
ఎంటీ —- 10.99 —- 12.10 — 13.49 — 14.89
సీవీటీ —- —- —- 13.20 — 14.59 —- 15.99
1.5 లీటర్ల ఐ-వీటెక్ డీవోహెచ్సీ పెట్రోల్ ఇంజిన్ హోండా ఎలివేట్ (Honda Elevate) లోనూ వినియోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 119 బీహెచ్పీ విద్యుత్, 145 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 7-స్పీడ్ సీవీటీ (కంటిన్యూయస్లీ వారియబుల్ ట్రాన్స్మిషన్) ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎంటీ వేరియంట్ కారు లీటర్ పెట్రోల్ పై 15.31. కి.మీ, ఏఎంటీ వేరియంట్ 16.92 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ఈ20- పెట్రోల్ తోనూ ఈ కారు నడుస్తుంది. అంటే 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ తోనూ ఈ కారు నడుస్తుంది.
లార్జ్ బ్లాక్ గ్రిల్లె, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, హోండా క్రోమ్ స్ట్రిప్, రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లతో వస్తున్న హోండా ఎలివేట్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది.
10.25 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ డిస్ప్లే, 7-అంగుళాల ఫుల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ డిస్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, బ్రౌన్ లెథరెట్టే అప్ హోల్స్టరీ, సన్ రూఫ్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సహా అడాస్ సిస్టమ్ ఫీచర్లు జత చేశారు. లేన్ వాచ్ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, కొల్లిషన్ అవాయిడెన్స్ బ్రేకింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. మూడేండ్ల అన్ లిమిటెడ్ వారంటీ, ఐదేండ్ల వరకూ ఎక్స్ టెన్షన్ వారంటీ అందిస్తారు. 10 ఏండ్ల వరకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ లభిస్తుంది.