Honda Elevate | జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) మంగళవారం మిడ్ సైజ్ ఎస్యూవీ హోండా ఎలివేట్ (Honda Elevate) భారత్ మార్కె్ట్లో ఆవిష్కరించింది. త్వరలో ప్రారంభమయ్యే పండుగల సీజన్లో ఎలివేట్ మోడల్ కారు ఆవిష్కరణకు హోండా కార్స్ రంగం సిద్ధం చేస్తున్నది. హ్యుండాయ్ క్రెటా, కియా మోటార్ సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, ఎంజీ అస్టర్ వంటి మోడల్ కార్లకు హోండా ఎలివేట్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి హోండా ఎలివేట్ కారు కోసం బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.
ఎస్యూవీ వేరియంట్లకు ప్రజల్లో ఉన్న పాపులిరిటీని సొమ్ము చేసుకోవాలని హోండా కార్స్ తలపోస్తున్నది. అందుకే ఎలివేట్ మోడల్ తెస్తున్నది. భారత్ మార్కెట్లోకి వచ్చే ఏడేండ్లలో ఐదు కొత్త ఎస్యూవీ మోడల్ కార్లను తీసుకు రానున్నది. వాటిల్లో ఒక ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉంటుందని వెల్లడించింది.
తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన ఎలివేట్ విద్యుత్ వేరియంట్ కారు మూడేండ్లలో యూజర్లకు అందుబాటులోకి తెస్తామని హోండా కార్స్ తెలిపింది. ప్రస్తుతం భారత మార్కెట్లో సిటీ, అమేజ్ అనే సెడాన్ మోడల్ కార్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్ల సేల్స్‌లో సెడాన్ మోడల్ కార్ల వాటా 10 శాతం మాత్రమే.. అయినా ఈ పది శాతం మోడల్ కార్లలోనే తమ కార్లకు మంచి గిరాకీ లభిస్తున్నదని హోండా కార్స్ సీఈఓ టక్య సమురా వెల్లడించారు. ఎస్‌యూవీల విక్రయంలో 40 శాతం వాటా తమదేనన్నారు. ఏయేటికాయేడు ఎస్యూవీ వేరియంట్ల సేల్స్ వృద్ధి చెందుతున్నాయి.
ఇంజిన్: 1500 సీసీ (1.5 లీటర్ల డీవోహెచ్సీ ఐ-వీటెక్)
విద్యుత్: 121 బీహెచ్పీ విద్యుత్
టార్చి : 145 ఎన్ఎం
స్మార్ట్ డిస్ ప్లే: 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే అండ్ ఐపీఎస్ హెచ్డీ రిజొల్యూషన్ ఎల్సీడీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ కంపాటిబుల్ విత్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో.
సెకండ్ రో: 60/40 స్ప్లిట్ అండ్ ఫోల్డబుల్ సీట్
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్: సెమీ డిజిటల్
అడాస్: హోండా సెన్సింగ్ అడాస్
హిల్ డిస్కెండ్ కంట్రోల్ : ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్లలో లభ్యం.
6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో హోండా ఎలివేట్ లభిస్తుంది. ఈ కారు ధర రూ.10.50 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య పలుకుతుందని అంచనా. ఫ్యుయల్ వినియోగం, ట్రిప్ మీటర్, ఔట్ సైడ్ టెంపరేచర్, జీ-మీటర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.