ఇప్పుడు కరోనాతో ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇన్పుట్ కాస్ట్, ముడి సరుకు, విడి భాగాల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు కార్ల తయారీ సంస్థలు తమ కార్ల ధరలు పెంచుతామని ప్రకటిస్తే..జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. కొనుగోలుదారులకు ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అమేజ్ మొదలు, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ మోడల్ కార్లపై ఈ రాయితీలు లభిస్తాయి. క్యాష్ బెనిఫిట్స్, ఎక్స్చేంజ్ బోనస్, లాయాల్టీ బోనస్, ఎఫ్‌వోసీ యాక్సెసరీస్, కార్పొరేట్ బోనస్ తదితర డిస్కౌంట్లు అందిస్తోంది హోండాకార్స్. ఈ నెలలోనే మీరు హోండా కారు కొనుగోలు చేయాలనుకుంటే భారీ డిస్కౌంట్లు అందుకోవచ్చు. ఆయా మోడల్ కార్లపై హోండా కార్స్ అందిస్తున్న డిస్కౌంట్లు, రాయితీలపై ఓ లుక్కేద్దాం..
గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కంపెనీ కార్లలో హోండా అమేజ్. దీనిపై రూ.15 వేల వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ రూ.5,000, ఎక్స్చేంజ్ బోనస్ రూ.6,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4000 అందిస్తున్నది.
కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటి హోండా సిటీ. దీనిపై రూ.35,596 రాయితీ ఇస్తున్నది. క్యాష్ బెనిఫిట్ రూపేణా రూ.10వేలు, ఎఫ్‌వోసీ యాక్సెసరీస్‌తో కలిపి రూ.10,596 రాయితీ కల్పిస్తున్నది. ఇక ఎక్స్చేంజ్ బోనస్ రూ.50000, లాయల్టీ బోనస్ రూ.5000 అందిస్తున్నది. హోండా కార్ ఎక్స్చేంజ్పై రూ.7000తోపాటు కార్పొరేట్ బోనస్ పేరిట రూ.8,000 బెనిఫిట్ అందుకోవచ్చు.
పాత మోడల్ హోండా సిటీ కారుపై రూ.20 వేల డిస్కౌంట్లు పొందొచ్చు. లాయల్టీ బోనస్ రూపేణా రూ.5000, ఎక్స్చేంజ్ బోనస్ రూ.7000 లభిస్తాయి. ఫోర్త్ జనరేషన్ హోండా సిటీపై రూ.8000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుకోవచ్చు.
హోండా కార్స్ క్రాస్ హ్యాచ్ మోడల్ డబ్ల్యూఆర్-వీ కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ నెలలో కొనుగోలు చేసే డబ్ల్యూఆర్-వీ మోడల్ కారుపై రూ.10 వేల ఎక్స్చేంజ్ బోనస్, హోండా కారు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ బెనిఫిట్ రూ.17 వేల వరకు పొందొచ్చు. లాయాల్టీ బోనస్ రూపేణా రూ.5000, కార్పొరేట్ బోనస్‌గా రూ.4000 రాయితీ లభిస్తుంది.
హోండా జాజ్ మోడల్ కారుపై రూ.33,147 వరకు బెనిఫిట్లు తీసుకోవచ్చు. ఇందులో క్యాష్ బెనిఫిట్ రూ.10వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.5,000, లాయాల్టీ బోనస్ రూ.5000, కార్పొరేట్ బోనస్ రూ.4000 లభిస్తాయి. ఇక ఎఫ్‌వోసీ యాక్సెసరీస్‌పై క్యాష్ బెనిఫిట్ రూ.12,147 వరకు లభిస్తుంది. హోండా కారు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎక్స్చేంజ్ బోనస్ రూ.12వేల వరకు అందిస్తున్నది.