Honda Cars Year End Offers | ఆ రెండు కార్లపై హోండా బంపర్ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే.. ఇవీ డిటైల్స్
Honda Cars Year End Offers | జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఇయర్ ఎండ్ సందర్భంగా హోండా సిటీ, హోండా అమేజ్ మోడల్ కార్లపై రూ.88 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తోంది.
Honda Cars Year End Offers | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తమ కస్టమర్లకు ఇయర్ ఎండ్ (Year End) ఆఫర్లు ప్రకటించింది. భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న సిటీ (City), అమేజ్ (Amaze) సెడాన్ మోడల్ కార్లపై గరిష్ట బెనిఫిట్లు అందిస్తామని గురువారం తెలిపింది. హోండా సిటీ (Honda City)పై గరిష్టంగా రూ.88,600, హోండా అమేజ్ (Honda Amaze)పై రూ.77 వేల వరకు బెనిఫిట్లు పొందొచ్చు. ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన హోండా ఎలివేట్ (Honda Elevate)పై ఎటువంటి డిస్కౌంట్లు ఆఫర్ చేయలేదు. హోండా సిటీ, హోండా అమేజ్ మోడల్ కార్లపై డిస్కౌంట్లు ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయి. వచ్చే నెల నుంచి ఈ రెండు మోడల్ కార్ల ధరలు పెంచుతామని హోండా కార్స్ ఇంతకుముందే ప్రకటించింది.
హోండా సిటీపై డిస్కౌంట్లు ఇలా
హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ (Honda City Facelift)పై క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేల వరకు లభిస్తుంది. ప్రత్యామ్నాయంగా డీలర్ ద్వారా రూ.26,947 వరకు ఫ్రీ యాక్సెసరీస్ రూపంలో పొందొచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కస్టమర్ లాయల్టీ బోనస్ రూ.4,000, హోండా కార్ ఎక్స్చేంజ్ బోనస్ రూ.6,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000, కార్పొరేట్ స్పెషల్ డిస్కౌంట్ రూ.20 వేల వరకు లభిస్తుంది.
హోండా సిటీ వీఎక్స్, హోండా సిటీ జడ్ఎక్స్ వేరియంట్లపై రూ.13,651 విలువైన వారంటీ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి ఎంటరైన సిటీ ఎలిగెంట్ ఎడిషన్ మీద రూ.40 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేల వరకు లభిస్తాయి. సిటీ హైబ్రీడ్ వేరియంట్లకూ డిస్కౌంట్లు వర్తిస్తాయి.
హోండా అమేజ్‌పై ఇలా ఆఫర్లు
హోండా అమేజ్ (Honda Amaze) ఎస్ వేరియంట్ మీద రూ.35 వేల క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.42,444 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ పొందొచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ ద్వారా రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూ.20 వేలు అందిస్తోంది. రూ.4000 విలువైన లాయాల్టీ బోనస్ కూడా పొందొచ్చు.
హోండా అమేజ్ ఈ (Honda Amaze E) వేరియంట్ మోడల్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేలు లేదా రూ.18,148 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ అందిస్తోంది. ఈ సబ్ కంపాక్ట్ సెడాన్ కారుపై లాయాల్టీ బోనస్ రూ.4,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూ.20 వేలు, పాత కారు ఎక్స్చేంజ్ కింద బోనస్ రూ.15 వేలు పొందొచ్చు.
హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్ కారు రూ.30 వేల స్పెషల్ ఎడిషన్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, లాయాల్టీ బోనస్ రూ.4000 లభిస్తుంది. అమేజ్ వీఎక్స్పై రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.30,245 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ అందజేస్తోంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 అందిస్తున్నది. హోండా కార్ల కస్టమర్లకు రూ.4000 లాయాల్టీ బోనస్ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

