Honda Cars | హోండా కార్స్ ఇండియా.. భారత్‌లో కేవలం రెండు మోడల్ కార్లు మాత్రమే విక్రయిస్తున్నది. అవి కంపాక్ట్ సెడాన్ అమేజ్.., మిడ్‌సైజ్ సెడాన్ కారు సిటీ. మీరు వాటిల్లో ఒక కారు సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే అమేజ్, సిటీ మోడల్ కార్లపై ఏప్రిల్ నెలలో భారీ డిస్కౌంట్లు అందిస్తున్నది హోండా కార్స్.
ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన హోండా సిటీ-2023 వేరియంట్‌పై మొత్తం రూ.15 వేల మేరకు బెనిఫిట్లు ఇస్తున్నది. కస్టమర్ లాయల్టీ బోనస్ కింద రూ.4000, హోండా కార్ ఎక్స్చేంజ్ బోనస్ రూ.6000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.5000 రాయితీ అందిస్తున్నది. హోండా సిటీ-2023 కారు ధర రూ.11.49 లక్షల నుంచి రూ.20.39 లక్షల మధ్య పలుకుతున్నది. మిడ్ సైజ్ సెడాన్ కారు పెట్రోల్ ఇంజిన్‌తోనూ, హైబ్రీడ్ సిస్టమ్‌తోనూ పని చేస్తుంది.
హోండా సిటీ కారు 1.5 లీటర్ల వీటెక్ డోక్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 121 పీఎస్ విద్యుత్, 145 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 7-స్పీడ్ సీవీటీ ఆప్షన్లలో ఈ ఇంజిన్ నడుస్తుంది. హైబ్రీడ్ సిస్టమ్‌లో టూ మోటార్ ఈ-సీవీటీ యూనిట్.. 1.5 లీటర్ల అట్కిన్సన్-సైకిల్ డోక్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ విత్ లిథియం అయాన్ బ్యాటరీతో కనెక్ట్ చేస్తారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 126 పీఎస్ విద్యుత్, 253 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
దేశీయ మార్కెట్లోకి ఎంటరై ఇటీవలే దశాబ్ద కలం పూర్తి చేసుకున్న హోండా అమేజ్‌పై గరిష్టంగా రూ.17 వేల వరకు డిస్కౌంట్లు వస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.10 వేలు లేదా ఎఫ్‌వోసీ విడి భాగాలు రూ.12,296, కస్టమర్ లాయల్టీ బోనస్ రూ.4000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 అందిస్తున్నది. అమేజ్ కారు రూ.6.99 లక్షల నుంచి రూ.9.60 లక్షల మధ్య లభిస్తుంది. ఈ కారు 1.2 లీటర్ల ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఇది 90 పీఎస్ గరిష్ట విద్యుత్, 110 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరిస్తుంది. ఈ కారు ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా సీవీటీతో వస్తుంది.