Home Loan Interest Rate | సొంతింటి కొనుగోళ్లకు ప్రోత్సాహం.. పెరగనున్న గిరాకీ
Home Loan Interest Rate | కీలక వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించడంతో తక్కువ వడ్డీరేట్లకే ఇంటి రుణాలు లభించ

Home Loan Interest Rate | సొంతింటి కల సాకారం చేసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించడంతో తక్కువ వడ్డీరేట్లకే ఇంటి రుణాలు లభించనున్నాయి. తక్కువ వడ్డీరేట్లు కొనసాగుతుండటంతో డ్రీమ్ హౌస్ లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకర వాతావరణం నెలకొల్పుతుంది.
తగ్గనున్న భారం ఇలా
ప్రస్తుత తక్కువ వడ్డీరేట్లతో సొంతిల్లు కొనుగోలు దారులపై భారం తగ్గుముఖం పడుతుంది. తక్కువ వడ్డీరేట్ల విధానాన్ని రెగ్యులర్ ఇండ్ల కొనుగోలుదారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుత విధానంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మున్ముందు మరింత డిమాండ్
ప్రస్తుతం తక్కువ వడ్డీరేట్లతో సొంతింటి కొనుగోలు దారులు ఆనందిస్తున్నారు. వడ్డీరేట్లు మరింత తగ్గితే సొంతిండ్ల కొనుగోళ్లకు మరింత డిమాండ్ పెరుగుతుందని బెన్నెట్ అండ్ బెర్నార్డ్ గ్రూప్ వ్యవస్థాపకుడు లింకోల్న్ బెన్నెట్ రోడ్రిగ్యూస్ వ్యాఖ్యానించారు.
ఉద్దీపన ప్రకటించాలన్న డిమాండ్లు
కొనుగోలుదారుడిలో విశ్వాసాన్ని మరింత పెంచేందుకు రుణ పరపతి నిబంధనలను సరళతరం చేయడానికి ఉద్దీపన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని లింకోల్న్ బెన్నెట్ రొడ్రిగ్యూస్ చెప్పారు. ఈ దిశగా ఎటువంటి ప్రకటన చేసినా అభినందనీయమేనని పేర్కొన్నారు.

కొనుగోలుదారులకు అనుకూల పరిస్థితులు
ప్రస్తుతం కొనసాగుతున్న తక్కువ వడ్డీరేట్లతో రెగ్యులర్ ఇంటి కొనుగోలు దారులు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని స్టెర్లింగ్ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రమణి శాస్త్రి చెప్పారు. ఓవరాల్‌గా రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న డిమాండ్ మరింత ముందుకు వెళుతుందని తెలిపారు.

ఎకానమీ గ్రోత్‌కు ప్రోత్సాహం.. శక్తికాంత దాస్
వ్యక్తిగత ఇండ్లు, వాణిజ్య సముదాయాల కొనుగోళ్లకు తీసుకునే రుణాలపై గణనీయంగా వడ్డీరేట్లు తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థ పురోభివ్రుద్ధికి ప్రోత్సాహంగా నిలుస్తాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం జోస్యం చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం ఉపాధి కల్పనకు తోడ్పాటుగా నిలుస్తుందన్నారు.
నిధుల సమీకరణ సులభతరం
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిధుల సమీకరణకు ఆర్థిక వ్యవస్థను సులభతరం చేసేందుకు ద్రవ్య పరపతి చర్యలు గణనీయ పురోగతి సాధించడానికి ప్రతిబింబంగా నిలుస్తాయని శక్తికాంత దాస్ చెప్పారు. 2019 ఫిబ్రవరి నుంచి రెపొరేట్ 250 బేసిక్ పాయింట్లు తగ్గింది. ఫలితంగా తాజా రుణాలపై వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (డబ్ల్యూఏఎల్ఆర్) 217 బేసిక్ పాయింట్లు తగ్గుతుందన్నారు.

హోంలోన్లకు తక్కువ వడ్డీరేట్లు చేయూత
హోంలోన్ తీసుకునే వారిపై భారం తగ్గడానికి తక్కువ వడ్డీరేటు చేయూతనిస్తుందని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. తక్కువ వడ్డీరేట్లు సొంతిల్లు కొనుగోలుదారులకు ప్రోత్సాహాన్ని ఇస్తాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వడ్డీరేట్ల తగ్గింపుతో సొంతింటి కొనుగోళ్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
SBI’s ‘Monsoon Dhamaka’ |హోంలోన్లపై ఎస్బీఐ ఆఫర్…!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
Amazon Big win on Reliance | సింగపూర్ కోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందే..!
Richest Person: బెజోస్‌ను వెనక్కి నెట్టిన లూయీ విటాన్ అధినేత
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- home loan
- Monetary Policy
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

