Ambassador | న్యూఢిల్లీ, మే 11: ఒకప్పుడు దేశీయ రోడ్లపై దూసుకుపోయిన అంబాసిడర్ కారు మళ్లీ వస్తోంది. హిందుస్థాన్ మోటర్ సంస్థ ఈ నయా అంబాసిడర్ కారుకు తుది మెరుపులు దిద్దుతున్నది. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మాడల్‌ను దశాబ్దాల క్రితం సంస్థ నిలిపివేసింది. ఆటోమొబైల్ రంగంలోకి ఎన్నో కంపెనీలు ప్రవేశించడం, ఈ పాత మాడల్‌కు ఆదరణ తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నది.
ప్రస్తుతం ఈ నయా మాడల్‌ను తిరిగి విడుదల చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. దీంతోపాటు అంబాసిడర్‌లోనే ఈవీని ప్రవేశపెట్టే ఉద్దేశంలో సంస్థ ఉన్నది. ఇందుకోసం సంస్థ యూరోపియన్‌కు చెందిన కంపెనీతో కలిసి పనిచేస్తున్నది. తొలి దశలో ద్విచక్ర వాహనాన్ని, ఆ తర్వాతి క్రమంలో నాలుగుచక్రాల వాహనాన్ని విడుదల చేయనున్నది. ఇందుకోసం రూ.300-400 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నది.