రెండేండ్లలో పెరిగిన బంగారం దిగుమతి
మార్చిలో గత రెండేండ్లలో మన దేశం అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకున్నది

ముంబై : మార్చిలో గత రెండేండ్లలో మన దేశం అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకున్నది. గత నెలలో 98.6 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. మార్చి నెలలో 13 టన్నులతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువగా ఉన్నది. ఇది 2019 మే తరువాత అత్యధిక దిగుమతి అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
బ్లూమ్‌బెర్గ్ డాటా ప్రకారం, మార్చి త్రైమాసికంలో దేశంలో దిగుమతులు గత సంవత్సరం నుంచి 190 టన్నులకు రెట్టింపు అయ్యింది. మార్చి 2021 లో రూ.63 వేల కోట్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది. 2020 మార్చితో పోల్చితే రూ. 9 వేల కోట్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు దిగుమతిదారుగా భారతదేశం నిలిచింది. బంగారు దిగుమతుల పెరుగుదల వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3 త్రైమాసికాలలో దిగుమతులు తగ్గడం వల్ల కరెంట్ ఖాతా మిగులులో ఉన్నది. అయితే, దిగుమతుల పెరుగుదల కారణంగా అది మళ్ళీ లోటులోకి చేరవచ్చని నిపునులు భావిస్తున్నారు.
2020 ఆగస్టు నుంచి బంగారం ధరలు 17 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. వివాహాల సీజన్ కాకుండా అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో తగ్గిన ధరలకు డిమాండ్ పెరిగింది. అలాగే, ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుండి 7.5 శాతానికు తగ్గించడం వల్ల బంగారం దిగుమతులు పెరిగినట్లుగా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరత.. ఒకేరోజు నలుగురు మృతి
జలియన్ వాలా బాగ్ మారణకాండ.. బ్రిటిషర్ల దురాగతానికి 102 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

