Hero Xtreme 200S 4V | ప్రముఖ టూ వీలర్స్ తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్.. ప్రీమియం స్పోర్ట్స్ మోటారు సైకిల్ సెగ్మెంట్లో మరో స్పోర్ట్స్ బైక్ తీసుకొచ్చింది. గతంలో డిస్కంటిన్యూ చేసిన ఎక్స్ ట్రీమ్ 200ఎస్ స్థానే `ఎక్స్ ట్రీమ్ 200ఎస్ 4వీ (Xtreme 200S 4V)` మోటారు సైకిల్ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతోపాటు పలు అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ స్పోర్ట్స్ బైక్ ‘ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీ ((Xtreme 200S 4V)` వస్తున్నది.
భారత్ మార్కెట్లో 2023 హీరో ఎక్స్ ట్రీమ్ 200ఎస్ 4వీ బైక్ ధర రూ.1.41,250 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా అధికారిక డీలర్‌షిప్‌ల ద్వారా మోటారు సైకిళ్ల ప్రేమికులు కొనుక్కోవచ్చు. ఈ బైక్ మూడు డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్స్ -మూన్ ఎల్లో, ఫాంథర్ బ్లాక్ మెటాలిక్, మ్యాట్టె యాక్సిస్ గ్రే మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది.
ఈ మోటారు సైకిల్ 200సీసీ 4-వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఓబీడీ2 ఇంజిన్ విత్ ఎక్స్-సెన్స్ టెక్నాలజీతో వస్తున్నది. ఈ ఇంజిన్ 8000 ఆర్పీఎం వద్ద 19 హెచ్‌పీ, 6500 ఆర్పీఎం వద్ద 17.35 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీ బైక్.. ఈ-20 పెట్రోల్ తోనూ నడుస్తుంది.
న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీ బైక్.. డ్యుయల్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్పోర్టీ గ్రాఫిక్స్, ఎల్ఈడీ టెయిల్ లాంప్స్ విత్ ఎల్ఈడీ లైట్ గౌడ్, న్యూ స్ప్లిట్ హ్యాండిల్ బార్, మస్క్యులర్ రేర్ కౌల్, స్పోర్టీ కంపాక్ట్ ఎగ్జాస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
పూర్తిగా డిజిటల్ ఎల్సీడీ స్పీడో మీటర్ డిస్ ప్లేతో వస్తున్నది. ఇందులో గేర్ ఇండికేటర్, ఎకో మోడ్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్ తదితర ఆప్షన్లు ఉంటాయి. బ్లూ టూత్ కనెక్టివిటీ, రేర్ హగ్గర్ అండ్ టర్న్ బై టర్న్ నేవిగేషన్ విత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్, అప్ డేటెడ్ ఫ్రంట్ అండ్ రేర్ పెటల్ డిస్క్ బ్రేక్స్ విత్ సింగిల్ చానెల్ ఏబీఎస్ వంటి ఫీచర్లతో రైడింగ్‌కు కంఫర్టబుల్‌గా ఉంటుంది.