గురుగ్రామ్, జనవరి 30: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్..దేశీయ మార్కెట్‌కు మరో స్కూటర్‌ను పరిచయం చేసింది. 110 సీసీ సెగ్మెంట్లో విడుదల చేసిన ఈ నూతన స్కూటర్ ‘జూమ్స్’ ధర రూ.68,599 నుంచి రూ.76,699 మధ్యలో నిర్ణయించింది. బీఎస్-6 ప్రమాణాలకు లోబడి తీర్చిదిద్దిన ఈ స్కూటర్ 8.05 బీహెచ్పీ, 7,250 ఆర్పీఎంల శక్తినివ్వనున్నది. పూర్తిస్థాయి డిజిటల్ స్పీడ్మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలర్ ఐడీ, ఎస్ఎంఎస్ అప్డేట్, చమురు, ఫోన్ బ్యాటరీ అయిపోయిన విషయాన్ని అలర్ట్ చేయనున్నది. అలాగే సైడ్ స్టాండ్ ఇంజిన్ అలర్ట్, బూట్ లైట్, మొబైల్ చార్జర్ సదుపాయాలు కూడా ఉన్నాయి.