న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థలు హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ తమ వాహన ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. జీఎస్టీ తగ్గింపుతో కలిగే ఆర్థిక ప్రయోజనాలను క్టమర్లకు చేరవేయడంలో భాగంగా హీరో తన వాహన ధరలను రూ.15,743 వరకు తగ్గించింది.
దీంతో స్ప్లెండర్ +, గ్లామర్, ఎక్స్ట్రీమ్, స్కూటర్ల ధరలు కూడా మరింత దిగిరానున్నాయి. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రం కేవలం 350 సీసీ బైకు ధరను రూ.20 వేలు కోత పెట్టింది.