Health Insurance | చాలామందికి ఆరోగ్య బీమా క్లెయిములు తిరస్కరణకు గురవుతుండటాన్ని చూస్తూనే ఉంటాం. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కావడం వెనుక ప్రధానంగా ఈ పొరపాట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఇలా చేయవద్దు. మొదట క్లెయిమ్ ఫామ్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వరాదు. వయసు, పేరు, ఫోన్ నెంబర్ సరైనవే ఇవ్వాలి. అలాగే ఇప్పటికే మీకున్న ఆరోగ్య సమస్యలను దాచకండి. వెయిటింగ్ పీరియడ్లో క్లెయిమ్ చేయవద్దు.
రెగ్యులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను చెల్లిస్తూపోండి. క్లెయిమ్ చేయడాన్ని ఆలస్యం చేయవద్దు. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందివ్వండి. ప్రతీ చిన్న సమస్యకూ క్లెయిమ్ చేసేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఒక సమస్యకు చికిత్స తీసుకొని, మరో సమస్యకు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు చెప్పకండి. అయితే కొన్నిసార్లు పాలసీ నిబంధనలు మారడం వల్ల, బీమా సంస్థ/థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ వల్ల కూడా క్లెయిముల తిరస్కరణ జరుగవచ్చు.