Indian Rupee | అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లోని కేంద్ర బ్యాంక్‌ల సమీక్షా సమావేశాలు జరగనున్నందున ఈ వారంలో రూపాయి ఒడిదుడుకులకు లోనవుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు. వచ్చే కొద్ది రోజుల్లో యూఎస్డీ/ఐఎన్ఆర్ పెయిర్ 83.50 నుంచి 83.70 స్థాయిని చూడవచ్చని, 83 వద్ద మద్దతు పొందవచ్చని పర్మార్ అంచనా వేశారు. ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలకమైన పాలసీ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో రూపాయి ఒత్తిడికి లోనయ్యిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫారెక్స్ అనలిస్ట్ గౌరాంగ్ సోమయ్య తెలిపారు.
ప్రస్తుతానికి ఫెడ్ వడ్డీ రేట్లలో మార్పులేమీ చేయబోదన్న అంచనాలు ఉన్నప్పటికీ, భవిష్యత్ పెంపు పట్ల గవర్నర్ వెల్లడించే సంకేతాల పట్ల మార్కెట్లు ఆందోళన కనపరుస్తున్నాయన్నారు. యూఎస్డీ/ఐఎన్ఆర్ స్పాట్ మార్కెట్లో 83.05-83.50 మధ్య ట్రేడ్‌కావచ్చని సోమయ్య అంచనా వేశారు. క్రూడ్ ధరలు పెరగడం, స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడం, గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి తదితర అంశాలతో రూపాయి బలహీనంగానే ఉంటుందని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి వివరించారు. డాలర్/రూపీ స్పాట్ ధర 82.80-83.80 మధ్య కదలవచ్చన్నారు.