HDFC SME-Credit Cards | దేశంలోనే అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. వ్యాపారులు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవేత్తల కోసం కొత్తగా నాలుగు క్రెడిట్ కార్డులు తీసుకొచ్చింది. వ్యాపార లావాదేవీలన్నీ క్రెడిట్ ఫెసిలిటీ ఆధారంగా సాగుతున్న నేపథ్యంలో వ్యాపారుల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెచ్చిన క్రెడిట్ కార్డులు ఎలా ఉపయోగ పడతాయో చూద్దాం.. !
సదరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్లో ఆవిష్కరించిన నాలుగు క్రెడిట్ కార్డులపై 55 రోజుల వడ్డీ రహిత రుణ పరపతి లభిస్తుంది. ఇప్పటికే క్రెడిట్ కార్డుల మార్కెట్లో అత్యధిక వడ్డీ రహిత రుణ పరపతి కల్పిస్తున్న బ్యాంక్ తమదేనని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వ్యాపారాల్లో లావాదేవీలకు ఈ క్రెడిట్ కార్డులు మరింత ఫ్లెక్సిబిలిటీగా, సౌకర్యవంతంగా ఉంటాయి.
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తల (ఎంఎస్ఎంఈ)ల పేమెంట్స్ పరిష్కారాలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. బిజ్ ఫస్ట్, బిజ్ గ్రో, బిజ్ పవర్, బిజ్ బ్లాక్ అనే పేరులతో కొత్త క్రెడిట్ కార్డులు ఆవిష్కరించినట్లు తెలిపింది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తల విభిన్న చెల్లింపుల అవసరాలకు ఈ ఎస్ఎంఈ పేమెంట్స్ సొల్యూషన్స్ అందుబాటులోకి తెచ్చినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.
కరంట్ లేదా వాటర్ బిల్లులు, జీఎస్టీ, ఇన్‌కం టాక్స్, అద్దె పేమెంట్, వ్యాపార అవసరాల కోసం ప్రయాణాలు, వ్యాపార ఉత్పాదక టూల్స్ వంటి ఎమర్జెన్సీ బిజినెస్ ఖర్చుల్లో ఈ ఎస్ఎంఈ ఫోకస్డ్ క్రెడిట్ కార్డుల వాడంతో మనీ పొదుపు చేయొచ్చు. చేతిలో క్యాష్ ఉంటే ఖర్చు నిలువరించలేం.. క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపుతో ఖర్చులు గరిష్టంగా తగ్గించడానికి వీలుగా ఉంటుందని, అందుకు ఎస్ఎంఈ పేమెంట్ సొల్యూషన్స్ దోహద పడతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది.
బిజినెస్ ట్రాన్సాక్షన్ల బిల్లుల చెల్లింపులు, వసూళ్ల పరిష్కారానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. బిజినెస్ సంస్థల అద్దె పేమెంట్స్, యుటిలిటీ బిల్లులు తదితర చెల్లింపుల్లో సమగ్రత తీసుకొస్తుందీ ప్లాట్‌ఫామ్. ఎంఎస్ఎంఈల్లో క్రమబద్ధీకరించిన శక్తిమంతమైన పేమెంట్స్ సిస్టమ్ అందించడంతో బెటర్ మనీ మేనేజ్మెంట్ పద్దతులు అవలంభించడానికి వెసులుబాటు కలిగిస్తుంది.
విస్తృత శ్రేణి ఫీచర్లతో ఆకర్షణీయ ఎస్ఎంఈ ఫోకస్డ్ క్రెడిట్ కార్డులను జారీ చేసింది. దేశీయంగా క్రెడిట్ కార్డుల మార్కెట్లో గరిష్టంగా 55 రోజులూ వడ్డీ రహిత క్రెడిట్ పీరియడ్ అందిస్తున్న బ్యాంక్‌గా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిలిచింది. ఈ క్రెడిట్ కార్డులతో వ్యాపార లావాదేవీల కోసం చేసే ఖర్చుపై 10ఎక్స్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. అగ్ని ప్రమాదానికి గురైనా, దోపిడీ జరిగినా రిస్క్ లేకుండా బిజినెస్ బీమా కవరేజీ ప్యాకేజీ అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డులపై రుణంతోపాటు ఈఎంఐ ఆప్షన్ వెసులుబాటు వల్ల ఆర్థిక పరమైన సౌలభ్యం లభిస్తుంది. బిజినెస్ ఫోకస్డ్ క్యాటలాగ్, ట్రావెలింగ్, హోటళ్లలో డైనింగ్, మైక్రోసాఫ్ట్ 365, క్లియర్ ట్యాక్స్, అమెజాన్, గూగుల్ యాడ్స్ కోసం చెల్లింపులపై ఎక్స్‌క్లూజివ్ రీడిమ్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.