HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరో దఫా వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అన్ని టెన్యూర్ల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 10 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన వడ్డీరేట్లు సోమవారం (2022 ఆగస్టు 8) నుంచి అమల్లోకి వస్తాయి. ఫలితంగా వివిధ రకాల రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు చెల్లించాల్సిన నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ)ల భారం మరింత పెరగనున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 7.70 శాతం నుంచి 7.80 శాతానికి పెరిగింది. నెల టెన్యూర్ రుణంపై ఎంసీఎల్ఆర్ 7.80 శాతం, మూడు నెలల టెన్యూర్ రుణంపై వడ్్డీరేటు 7.85 శాతం, ఆరు నెలల గడువు రుణంపై 7.95 శాతానికి పెరిగింది. ఏడాది గడువు రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.10 శాతం, రెండేండ్ల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.20, మూడేండ్ల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.30 శాతం పెరిగింది.
తొలిసారి జూన్ ఏడో తేదీన 35 బేసిక్ పాయింట్ల మేరకు ఎంసీఎల్ఆర్ పెంచేసింది. తిరిగి గత నెల ఏడో తేదీన మరో దఫా 20 బేసిక్ పాయింట్లు పెంచివేసింది. ప్రస్తుత ఎంసీఎల్ఆర్కు అనుగుణంగా రుణ గ్రహీతలు తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లను రీసెట్ చేస్తారు. ఉదాహరణకు ఈ నెలలోనే మీ వడ్డీరేటు పెంచాల్సి వస్తే.. తక్షణం పెంచిన ఎంసీఎల్ఆర్ అమల్లోకి వస్తుంది.