హైదరాబాద్, జనవరి 21 : హెచ్‌సీఎల్ టెక్నాలజీ..హైదరాబాద్‌లో నూతన సెంటర్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ క్లయింట్లకు కృత్రిమ మేధస్సు, డిజిటల్ ట్రాన్స్మిషన్ సొల్యుషన్స్ సేవలు అందించాలనే ఉద్దేశంతో నగరంలో కొత్తగా సెంటర్‌ను ఆరంభించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సీ విజయకుమార్ తెలిపారు. హై-టెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 5 వేల మంది కూర్చోవడానికి వీలుంటుందన్నారు.
హైదరాబాద్, జనవరి 21: విప్రో అనుబంధ సంస్థయైన విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సంస్థ..హైదరాబాద్‌లో ఐవోటీ ఆధారిత ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. రాష్ట్రంలో అత్యాధునిక లైటింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సెంటర్‌ను నెలకొల్పినట్లు, దేశంలో ఇది రెండో సెంటర్‌ని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ అనూజ్ ధీర్ తెలిపారు.