హైదరాబాద్, జనవరి 27 : అరుణ్ ఐస్క్రీం పేరుతో ఐస్క్రీం ఉత్పత్తులను విక్రయిస్తున్న హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్.. జహీరాబాద్ ప్లాంట్ సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నది. గతంలో రోజుకు లక్ష కిలోల ఐస్క్రీంలను ఉత్పత్తి అవుతున్న ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 1.27 లక్షల కిలోలకు పెంచుకున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్జీ చంద్రమోగన్ తెలిపారు. దీంతో ఈ యూనిట్ దేశంలో అతిపెద్ద ఐస్క్రీం యూనిట్ కావడం విశేషమన్నారు. దీంతో గ్రూపు టర్నోవర్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్లోని సూరారం వద్ద రోజుకు 2.8లక్షల లీటర్ల పాలను కలుపుకోని 20 ప్లాంట్లలో రోజుకు 32 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నదని చెప్పారు.