హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అనుబంధ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) చైర్మన్గా రాజ్కో గ్రూపు ఎండీ గుర్మీత్ సింగ్ అరోరా, వైస్ చైర్మన్గా బ్లూ స్టార్ లిమిటెడ్ ఎండీ బీ త్యాగరాజన్ ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక మండలి సమావేశం సందర్భంగా ఈ ఎన్నిక జరిగినట్లు సీఐఐ అధికారులు తెలిపారు.