హైదరాబాద్, ఆగస్టు 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.68.30 కోట్ల నికర లాభాన్ని గడించింది గల్ఫ్ ఆయిల్ లుబ్రికెంట్స్ ఇండియా. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.56.53 కోట్ల లాభంతో పోలిస్తే 20.8 శాతం వృద్ధిని కనబరిచింది.
హిందుజా గ్రూపునకు చెందిన ఈ సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14.90 శాతం ఎగబాకి రూ.811.71 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికపు ఆదాయం, పన్నులు చెల్లించిన తర్వాత లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని గల్ఫ్ ఆయిల్ ఎండీ, సీఈవో రవీ చావ్లా తెలిపారు.