GST collections | గతేడాదితో పోలిస్తే జనవరిలో జీఎస్టీ వసూళ్లు 12.3 శాతం వృద్ధి చెంది రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పండుగల సీజన్ తర్వాత వాడకం నెమ్మదించడంతో 2023తో పోలిస్తే 2024 డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 7.3 శాతం వృద్దితో రూ.1.77 లక్షల కోట్ల వద్ద నిలిచాయి. 2024 నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 8.5 శాతం పెరిగినా, డిసెంబర్లో నెమ్మదించాయి.
ఇక మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.36,100 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.44,900 కోట్లు, ఐజీఎస్టీ వసూళ్లు రూ.1.01 లక్షల కోట్లు, జీఎస్టీ సెస్ వసూళ్లు రూ.13,400 కోట్లు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ల రూపంలో ఆదాయం 11 శాతం వృద్ధి చెంది రూ.11.78 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్లో తెలిపింది.