GST Collection | మే రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..!
GST Collection | మే నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలయ్యాయి. మేలో రూ.1,57,090 కోట్లుగా వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 12శాతం పెరిగిందని పేర్కొంది.
GST Collection | మే నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలయ్యాయి. మేలో రూ.1,57,090 కోట్లుగా వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 12శాతం పెరిగిందని పేర్కొంది. గత యేడాది రూ.1,40,885 కోట్లు వసూలయ్యాయి. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.28,411 కోట్లు కాగా.. ఎస్జీఎస్టీ కింద రూ.35,828 కోట్లు, ఐజీజీఎస్టీ కింద రూ.81,363 కోట్లు వసూలైనట్లు ఆర్థికశాఖ వివరించింది. సెస్‌ల రూపంలో మరో రూ.11,489 కోట్లుగా వసూలైనట్లు వివరించింది.
ఇంతకు ముందు ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. జీఎస్టీ వసూళ్ల విషయంలో ఏపీ, తెలంగాణ వృద్ధిని సాధించాయి. గతేడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ రూ.3047 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా.. ఈ ఏడాదిలో రూ.3,373 కోట్లు వసూలవగా.. 11 శాతం వృద్ధి నమోదైంది. ఇక తెలంగాణ గతేడాది రూ.3982 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఈ ఏడాది మే నెలలో 13 శాతం వృద్ధితో రూ.4507 కోట్ల వసూలయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Chiranjeevi Megaverse | చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక అసలు కథ ఇదే.. ‘మెగావర్స్’ టీజర్ వచ్చేసింది!
Road Accident | భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న థార్, ఐదుగురు మృతి
Prostate Cancer | ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తింపు, చికిత్సకు కొత్త మార్గదర్శకాలు.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఏం చెప్పింది..?
Sreejith Ravi | పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. త్రిసూర్ కోర్టు సంచలన తీర్పు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

