హైదరాబాద్, జనవరి 23: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.125.7 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది గ్రాన్యూల్స్ ఇండియా. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.124.3 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే వృద్ధిని కనబరిచింది. ఆదాయం రూ.1,146 కోట్ల నుంచి రూ.1,155 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో నిలకడైన వృద్ధిని సాధించినట్టు, అమెరికాలో ఫార్ములేషన్ వ్యాపారం భారీ వృద్ధిని నమోదు చేసుకున్నదన్నారు.