హైదరాబాద్, మే 15: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.130 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది గ్రాన్యూల్స్ ఇండియా. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.120 కోట్ల కంటే ఇది 8 శాతం అధికం.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ. 1,195 కోట్ల నుంచి రూ.1,176 కోట్లకు పడిపోయింది. మరోవైపు, రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.15 తుది డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది.