Relief For Vodafone | వొడాఫోన్‌కు బిగ్ రిలీఫ్.. ఏజీఆర్ బకాయిల చెల్లింపు గడువు 20 ఏండ్లు?!
Relief For Vodafone | ప్రైవేట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్లు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌లకు రిలీఫ్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా......

Relief For Vodafone | ప్రైవేట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్లు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌లకు రిలీఫ్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలను 10 ఏండ్లలో టెలికం సంస్థలు చెల్లించాలి. అంటే 2031 నాటికి టెలికం సంస్థల ఏజీఆర్ బకాయి చెల్లింపులు పూర్తవ్వాలి. కానీ దీన్ని 20 ఏండ్లకు పొడిగించేందుకు గల మార్గాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు అన్వేషిస్తున్నాయి. అలాగే టెలికం రంగ పునరుత్తేజానికి రిలీఫ్ ప్యాకేజీ ప్రక్రియ ఖరారు చేసే పనిలోనూ కేంద్రం ఉంది.
ఏజీఆర్ బకాయిల గడువు పెంపుకు ఇవీ కారణాలు
సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా టెలికం సంస్థల ఏజీఆర్ బకాయిల చెల్లింపు గడువును 20 ఏండ్లకు పెంచాలని ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఆమోదించిందని సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలను దాట వేయకూడదన్నా.. టెలికం రంగ భవిష్యత్, బ్యాంకుల రుణ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల భవితవ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వినికిడి.
గడువు పెంపుతో వొడాఫోన్ ఐడియాకు రిలీఫ్
వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సంస్థల్లో ఎయిర్టెల్ ఆర్థికంగా గట్టిగానే ఉంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు ఏజీఆర్ బకాయి వాయిదాలు పెంచడం వల్ల రిలీఫ్ లభిస్తుంది. జూన్ నాటికి రూ.920 కోట్ల నగదు మాత్రమే ఉంది. ఏజీఆర్ బకాయిలు రూ.58,254 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.7,854 కోట్లు చెల్లించేసింది. దీనికి తోడు రూ.1.9 లక్షల కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. వచ్చే మార్చిలోపు రూ.9000 కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. టారిఫ్ పెంపు, నిధుల సేకరణ, కేంద్రం నుంచి రిలీఫ్ లభించకుండా వొడాఫోన్ ఐడియా.. ఏజీఆర్ బకాయిలు చెల్లించలేదు.
రిలీఫ్ ప్యాకేజీతోనే కొత్త పెట్టుబడులు.. వొడాఫోన్ ఐడియా
ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీ ప్రకటిస్తే.. తాము కంపెనీకి పెట్టుబడులు తీసుకు రావడానికి సిద్ధం అని వొడాఫోన్ ఎండీ టక్కర్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వొడాఫోన్ ఐడియాలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోమని బ్రిటన్ వొడాఫోన్, దేశీయ ఆదిత్య బిర్లా గ్రూప్ తేల్చేశాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్తోపాటు మూడు ప్రైవేట్ సంస్థలతో కూడిన టెలికం రంగాన్ని కొనసాగించే విషయమై ప్రభుత్వ, టెలికం రంగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Spondylitis | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు కొత్త తంటా.. పెరుగుతున్న మెల్లకన్ను సమస్యలు
తల్లిదండ్రులకు హెచ్చరిక.. డిజిటల్ మాధ్యమాలు ఎక్కువగా వాడే పిల్లల్లో ఊబకాయం ముప్పు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

