SBI Dinesh Kharra | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్గా దినేశ్ ఖర్రా పదవీ కాలాన్ని 2024 ఆగస్టు వరకూ పొడిగించిందని సమాచారం. ఈ నెల ఏడో తేదీతో ఆయన పదవీ కాలం ముగిసిపోతున్న నేపథ్యంలో కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన వయస్సు 63 ఏండ్లు వచ్చే వరకూ ఈ బ్యాంక్ చైర్మన్గా కొనసాగుతారని ప్రభుత్వం నిర్ణయించినట్లు వినికిడి. వచ్చే ఏడాది ఆగస్టుతో ఆయనకు 63 ఏండ్లు నిండుతాయి. దీని ప్రకారం 2024 ఆగస్టు 28 వరకూ ఆయన ఎస్బీఐ చైర్మన్గా ఉంటారు. ఎస్బీఐ చైర్మన్గా దినేశ్ ఖర్రా 2020 అక్టోబర్ ఏడో తేదీన నియమితులయ్యారు. ఎస్బీఐ నిబంధనల ప్రకారం ఆయన వయస్సు 63 ఏండ్లు వచ్చే వరకూ ఈ పదవిలో కొనసాగవచ్చు.
1984లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా దినేశ్ ఖర్రా కెరీర్ ప్రారంభించారు. రిటైల్ క్రెడిట్, ఎస్ఎంఈ అండ్ కార్పొరేట్ క్రెడిట్, డిపాజిట్ మొబిలైజేషన్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, బ్రాంచ్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో సేవలందించారు. ఇక ఎస్బీఐ ఎండీ అశ్వినీ తివారీ పదవీ కాలం రెండేండ్లపాటు క్యాబినెట్ నియామకాల సబ్ కమిటీ (ఏసీసీ) పొడిగించింది.