న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా దేవదత్త చంద్ నియమితులయ్యారు. జూలై 1 నుంచి మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ శనివారం సమావేశమై ఈ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ చద్దా..వచ్చే జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ స్థానాన్ని దేవదత్త భర్తి చేయనున్నారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) చీఫ్‌గా రజనీష్ కర్ణాటక నియమితులయ్యారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రజనీష్ వెంటనే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.