Google Play UPI Autopay | డెవలపర్లకు గుడ్‌న్యూస్.. యూపీఐ ఆటోపే ఆప్షన్‌కు ఓకే.. ఎందుకంటే?!
Google Play UPI Autopay | సబ్స్క్రిప్షన్ బేస్డ్ డెవలపర్లు `ఆటోపే` ఆప్షన్ కింద చెల్లింపులు జరిపేందుకు గూగుల్ ప్లే స్టోర్స్ అనుమతించింది.
Google Play UPI Autopay | గూగుల్ మంగళవారం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌లో తన ప్లే స్టోర్ నుంచి సబ్స్క్రిప్షన్ బేస్డ్ కొనుగోళ్లకు యూపీఐ ఆటోపేమెంట్ ఆప్షన్‌ను ప్రవేశ పెట్టినట్లు ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన యూపీఐ 2.0 విధానంలో భాగంగా `ఆటో పే` ఆప్షన్ తీసుకొచ్చింది. రికరింగ్ పేమెంట్స్ జరిపే కస్టమర్లు ఏదేనీ యూపీఐ అప్లికేషన్ ద్వారా పేమెంట్స్ చేయడానికి `ఆటో పే` ఆప్షన్ చేయూతనిస్తుంది. 2019 నుంచి గూగుల్ ప్లేస్టోర్‌లో పేమెంట్ ఆప్షన్‌గా యూపీఐ ఉంది.
`డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌పై యూపీఐ ఆటో పే ఆప్షన్‌ను ప్రవేశపెట్టడంతో యూపీఐ సబ్స్క్రిప్షన్ బేస్‌గా కొనుగోళ్లు జరిపే కస్టమర్లకు వెసులుబాటు కల్పించడమే మా లక్ష్యం. దీనివల్ల చాలా మందికి చేయూతనిస్తుంది. సంతోషకరంగా సేవలు పొందడానికి వీలు కలిగిస్తుంది. గూగుల్ ప్లేపై సబ్స్క్రిప్షన్ బేస్డ్గా సేవలు పొందే స్థానిక డెవలపర్లు అభివృద్ధి చెందేందుకు ఆటో పే ఆప్షన్ ఉపకరిస్తుంది` అని గూగుల్ ప్లే రిటైల్ అండ్ పేమెంట్స్ యాక్టివేసన్ ఇండియా, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ హెడ్ సౌరవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
సబ్స్క్రిప్షన్స్ ఈజీ కావడానికి యూపీఐ ఆటో పే వీలు కలిగిస్తుందని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ప్లే స్టోర్‌లో కొనుగోళ్లకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎంపిక చేశాక.. కార్ట్పైకి వెళ్లి సింపుల్‌గా పేమెంట్ మెథడ్ టాప్చేసి `పే విత్ యూపీఐ` అని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.డెవలపర్లకు థర్డ్ పార్టీ పేమెంట్స్ ప్రాసెసింగ్ సర్వీసెస్‌ను అనుమతించడం లేదని గూగుల్‌పై ఇటీవల సీసీఐ ఫెనాల్టీ విధించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

