Google Co-Founder for Divorce | విడాకుల కోసం గూగుల్ కోఫౌండర్ పిటిషన్
Google Co-Founder for Divorce | గూగుల్ కో-ఫౌండర్ సెర్జెయి బ్రిన్, భార్య నికోలే షానహన్ నుంచి విడాకులు కావాలని పిటిషన్ దాఖలు చేశారు.
Google Co-Founder for Divorce | సెర్చింజన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడాయన. ఆయన పేరు సెర్జెయి బ్రిన్. ప్రపంచ కుబేరుల్లో ఆరో ర్యాంక్‌లో ఉన్నారు. కానీ వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన జీవిత భాగస్వామి నికోలే షానహన్ నుంచి విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ప్రకారం సెర్జెయి బ్రిన్, నికొలే షానహన్ దంపతులకు విడాకులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
2015 నుంచి సహ జీవనం సాగిస్తున్న బ్రిన్, షానహన్ జంట 2018 నవంబర్ ఏడో తేదీన ఒక్కటయ్యారు. వారిద్దరికి రెండేండ్ల కూతురు కూడా ఉంది. కానీ మూడేండ్లకే వారి మధ్య విభేదాలు వెలుగు చూశాయి. గతేడాది డిసెంబర్ నుంచి విడివిడిగా ఉంటున్నట్లు కాలిఫోర్నియాలోని శాంతాక్లారాకౌంటీ కోర్టులో సబ్మిట్ చేసిన ఫైలింగ్‌లో తెలిపారు.
దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నా బ్రిన్ మాత్రం తమ కూతురికి జాయింట్ కస్టడీ కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై నికొలే షానహన్ నుంచి మద్దతు కోరలేదని సమాచారం. ఉన్నత స్థాయి ప్రొఫైల్ గల దంపతులు కావడంతో వారి విడాకుల నేపథ్యంలో చిన్నారి కస్టడీ సమస్య వస్తుందని కోర్టుకు సమర్పించిన పిటిషన్లో వివరించారు.
షానహన్‌ను వివాహం చేసుకోకముందు బ్రిన్ 23అండ్‌మీ కోఫౌండర్ అన్నే వోజ్కిక్కీని పెండ్లి చేసుకున్నా 2015లో విడిపోయారు. బ్రిన్, వొజిసిక్కీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బ్రిన్ రెండో భార్యగా షానహన్.. బియా ఎచో ఫౌండేషన్ ఫౌండర్‌గా ఉన్నారు. ప్రపంచంలోనే నాలుగో కుబేరుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్- మిలిందా బిల్‌గేట్స్ దంపతుల విడాకుల తర్వాత గూగుల్ సహ వ్యవస్థాపకుడు బ్రిన్ సెర్జెయ్ దంపతులు విడిపోవడం గమనార్హం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- divorce
- Sergey Brin
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

