ముంబై, మే 5 : మహీంద్రా అండ్ మహీంద్రా.. దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఎలక్ట్రిక్ మాడల్ ఎక్స్ఈవీ 9ఈపై రూ.4 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నది. ఈ కారు 23 లక్షలనుంచి రూ.31 లక్షలలోపు లభించనున్నది. ఈ ధరలు ముంబై షోరూంకు సంబంధించినవి. తన పోటీ సంస్థయైన హ్యుందాయ్‌కి చెందిన ఐనోక్ 5 మాడల్‌పై ఇంతే స్థాయిలో డిస్కౌంట్ ప్రకటించడంతో మహీంద్రా ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఐపోక్ మాడల్ ధర రూ.48.78 లక్షలకు దిగొచ్చింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి.