Gold Rates | ఒక్కరోజే రూ.700 తగ్గిన బంగారం.. వెండికీ హాల్ మార్కింగ్..!
Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం ధర రూ.700 తగ్గి రూ.79,000లకు పడిపోయింది.
Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం ధర రూ.700 తగ్గి రూ.79,000లకు పడిపోయింది. శుక్రవారం పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.79,700 వద్ద స్థిర పడింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.300 వృద్ధితో రూ.90,700లకు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.90,400 వద్ద ముగిసింది. సోమవారం 99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.700 తగ్గి రూ.78,600 పలికింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం రూ.79,300 వద్ద స్థిర పడింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.247క్షీణించి, రూ.77,070 పలికింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.479 పతనమై రూ.89,700 వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, కన్జూమర్ డిమాండ్లకు అనుగుణంగా వెండి, వెండి ఆభరణాల విక్రయంపై హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసే విషయమై సంబంధిత వాటాదారులతో సంప్రదించి చర్య తీసుకోవాలని బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ఇండియా (బీఎస్ఐ)ని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు.
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం 0.18 శాతం పుంజుకుని 2,659.60 డాలర్లు పలికింది. ఔన్స్ బంగారం 30.87డాలర్లకు చేరుకుంది. హాలీడే సీజన్ నేపథ్యంలో గత 20 ఏండ్ల తర్వాత జనవరిలో బంగారం ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని జ్యువెల్లరీ ఆభరణాల వ్యాపారులు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

