Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు ఫ్లాట్ గా కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం రూ.60 వేల వద్ద నిలకడగా కొనసాగుతున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. కిలో వెండి ధర కూడా రూ.74,400 వద్దే నిలిచింది.
‘మంగళవారం బులియన్ మార్కెట్ ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ (24 క్యారట్లు) తులం బంగారం ధర రూ.60,000 వద్దే కొనసాగింది. నిన్నటి ముగింపు ధర యధాతథంగా కొనసాగింది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర స్వల్పంగా తగ్గి 1922 డాలర్లు పలికింది. ఆగస్టు యూఎస్ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఔన్స్ వెండి ఫ్లాట్‌గా 23.12 డాలర్ల వద్దే స్థిరంగా కొనసాగింది.
ఇక ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారానికి గిరాకీ తగ్గింది. మంగళవారం మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో అక్టోబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ (24 క్యారట్లు) తులం ధర రూ.68 తగ్గి రూ.58,862కి పడిపోయింది. అంతర్జాతీయంగానూ న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.28 శాతం తగ్గి 1,941.70 డాలర్ల వద్ద స్థిర పడింది.