Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కె్ట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర మంగళవారం ఒక్కరోజే రూ.1,750 తగ్గి రూ.77,800లకు పడిపోయింది. సోమవారం సెషన్ లో 24 క్యారట్స్ బంగారం పది గ్రాములు ధర రూ.79,550లకు లభిస్తుంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2700 పడిపోయి రూ.91,300లకు చేరుకున్నది. సోమవారం కిలో వెండి ధర రూ.94 వేలు పలికింది.
మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ తులం బంగారం ధర రూ.612 పతనమై రూ.74,739 వద్ద ముగిసింది. గత నెల 10 తర్వాత ఫ్యూచర్స్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.75 వేల దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడంతో ఔన్స్ బంగారం ధర 2600 డాలర్లు పలికింది. ఇక ముందు 2500 డాలర్లకు పడిపోతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ఫ్యూచర్స్ మార్కెట్లో కిలోవెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.742 తగ్గిపోయి రూ.88,440లకు చేరుకుంది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 19.90 డాలర్లు తగ్గి 25,97.80 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ సిల్వర్ ధర 30.43 డాలర్ల వద్ద వద్ద ముగిసింది.