న్యూఢిల్లీ, జూన్ 23 : బంగారం ధరలు భారీగా పడిపోయాయి. తులం గోల్డ్ ధర రూ.1.50 లక్షల దిగువకు దిగొచ్చింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.3 వేలు తగ్గి రూ.1,49,300కి దిగొచ్చింది. బంగారంతోపాటు వెండి రెండు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కిలో వెండి ఏకంగా రూ.10, 500 లేదా 4.3 శాతం తగ్గి రూ.2.35 లక్షలకు తగ్గినట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చర్చలు కొలిక్కివస్తుండటం, క్రూడాయిల్ ధరలు దిగిరావడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ హెడ్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 70.33 డాలర్లు లేదా 2 శాతం తగ్గి 4,121.10 డాలర్లకు పడిపోగా, వెండి 4 శాతం తగ్గి 62.27 డాలర్లకు దిగొచ్చింది.