Gold Rate | సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా రూ.345 తగ్గింది. పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.345 తగ్గి రూ.60,065 పలికింది. ఆదివారం ట్రేడింగ్‌లో రూ.60,410 వద్ద ట్రేడయింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.675 తగ్గి రూ.74,400 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1982 డాలర్లు పలికితే, ఔన్స్ వెండి 24.95 డాలర్లకు చేరుకున్నది. ఆసియా దేశాల ట్రేడింగ్ సమయంలో బంగారం ధరలు తగ్గాయి.
గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా రూ.24 పెరిగి రూ.59,869లకు చేరుకుంది. స్పాట్ గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతుందన్న ఊహాగానాల మధ్య ఫ్యూచర్ మార్కెట్లో ధర పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్లో జూన్ కాంట్రాక్ట్ బంగారం తులం (24 క్యారట్లు) ధర రూ.24 పెరిగి రూ.59,869 పలికింది. అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగానే ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.11 శాతం పెరిగి 1992 డాలర్లు పలికింది.