Gold Price | పెండ్లిండ్ల సీజన్, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం, డాలర్ ఇండెక్స్.. అమెరికా బాండ్ల విలువ పతనం వంటి కారణాలతో ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా ఉన్న బంగారం ధర ధగధగ మెరుస్తూ పైపకి దూసుకెళ్తున్నది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.380 వృద్ధి చెంది రూ.57,490 పలికింది. సోమవారం ముగింపులో రూ.57,110కి చేరుకున్నది. గత నెల ఒకటో తేదీతో పోలిస్తే రూ.4,310 పెరిగింది. మంగళవారం కిలో వెండి రూ.700 పతనమై రూ.74 వేలకు చేరుకుంది.
ముంబై బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్లు) రూ.57,362లకు చేరుకుంది. ఆభరణాల తయారీలో వినియోగించే తులం బంగారం (22 క్యారట్లు) ధర రూ.57,132 పలుకుతున్నది. కిలో వెండి ధర రూ.68,006లకు లభిస్తుంది. కోల్‌కతాలో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.58 వేలకు దూసుకెళ్తే, 22 క్యారట్ల తులం బంగారం ధర రూ.55,050కి చేరుకుంది. హాల్మార్క్డ్ గోల్డ్ (22 క్యారట్లు రూ.55,900 పలుకుతున్నది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల (24 క్యారట్లు) బంగారం రూ.295 పెరిగి రూ.57,217లకు చేరుకుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పుత్తడి ధర పెరుగుతున్నదని సెక్యూరిటీస్ అనలిస్ట్ చెప్పారు. సోమవారం 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.56,922 పలికింది. మంగళవారం కిలో వెండి ధర రూ.63 తగ్గి రూ.68,779 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1938 డాలర్లు పలుకుతున్నది. ఈ వారాంతంలో వెలువడనున్న అమెరికా నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిని కేంద్రీకరించారని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవ్‌నీత్ దమానీ తెలిపారు.