2 లక్షల దిగువకు వెండి
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.500 తగ్గి రూ.1,45,800గా నమోదైంది. పసిడితోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి రూ.2 లక్షల దిగువకు పడిపోయింది.
- పది నెలల కనిష్ఠానికి పడిపోయిన ధరలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.500 తగ్గి రూ.1,45,800గా నమోదైంది. పసిడితోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి రూ.2 లక్షల దిగువకు పడిపోయింది.
ధర రూ.4 వేలు తగ్గి రూ.1.98 లక్షలుగా నమోదైంది. గత పది నెలల తర్వాత ధరలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన పుత్తడి, వెండి ధరలు సమీప భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1.40-1.44 లక్షల మధ్యలోకి పడిపోనున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ త్రివేది తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,011.44 డాలర్లకు పడిపోగా, వెండి 53.41 డాలర్లుగా నమోదైంది. పుత్తడి, వెండి ధరలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని, ఇండస్ట్రీ వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. ఈ నెల 28న జరుగుతున్న అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశంపై మదుపర్లు దృష్టి సారించడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

