Gold Rates | బులియన్ మార్కెట్లో ఈ వారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10న 24 క్యారట్ల తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.58,648 పలికితే, శనివారం రూ.59,338లకు చేరుకున్నది. వారంలో రూ.690 పెరిగింది. 24 క్యారట్ల బంగారం శనివారం రూ.59,338 పలికితే, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.54,354, 18 క్యారట్ల బంగారం రూ.44,504లకు చేరుకుంది.
కిలో వెండి ధర వారంలో రూ.4000 లకు పైగా పెరిగింది. జూలై 10న కిలో వెండి ధర రూ.70,514 ఉంటే, శనివారం (జూలై 15) రూ.74,979లకు దూసుకెళ్లింది. అంటే వారంలో కిలో వెండి ధర రూ.4,464 పిరమైందన్న మాట. ఈ నెల మొదటి నుంచి బంగారం ధర మెరుపులు మెరిపిస్తూనే ఉంది. ఈ నెల మూడో తేదీన తులం బంగారం ధర రూ.58,139 పలికితే, శనివారం (జూలై 15) రూ.59,338లకు చేరుకున్నది. అంటే రూ.1,199 పిరమైందని తెలుస్తున్నది.
మున్ముందు బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా సంకేతాలు ఇచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి 24 క్యారట్ల బంగారం తులం రూ.62 వేల మార్కుకు చేరే అవకాశం ఉందన్నారు.