హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాం రాజధాని హనోయ్కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి. వారానికి మూడు రోజులు(ఆది, బుధ, శుక్రవారాలు) హైదరాబాద్లో రాత్రి 11:45 గంటలకు బయలుదేరనున్న వీఎన్-984 విమాన సర్వీస్ ఆ మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు హనోయ్కి చేరుకోనున్నదని జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ పనిక్కర్ తెలిపారు.
తిరిగి హనోయ్లో అక్కడి సమయం ప్రకారం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరనున్న VN-985 విమాన సర్వీస్ రాత్రి 10:15కి హైదరాబాద్ చేరుకోనున్నదని వెల్లడించారు. ఈ నూతన ప్రత్యక్ష విమాన సేవలతో భారత్-వియత్నాం మధ్య పర్యాటక రంగం మరింత బలోపేతం కానుందని ఆయన అన్నారు.