జిల్లెట్ ఇండియా లాభం 92 కోట్లు
షేవింగ్, ఓరల్ క్లీనింగ్ ఉత్పత్తుల తయారీ సంస్థ జిల్లెట్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగాను సంస్థ రూ.91.75 కోట్లు పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.67.59 కోట్లతో పోలిస్తే ఇది 36 శాతం అధికం.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: షేవింగ్, ఓరల్ క్లీనింగ్ ఉత్పత్తుల తయారీ సంస్థ జిల్లెట్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగాను సంస్థ రూ.91.75 కోట్లు పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.67.59 కోట్లతో పోలిస్తే ఇది 36 శాతం అధికం. అమ్మకాలు పెరగడం, ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం సంస్థకు కలిసొచ్చింది.
అలాగే సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.619.44 కోట్లకు చేరుకున్నది. క్రితం ఏడాది ఇది రూ.552.89 కోట్లుగా ఉన్నది. జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,477.05 కోట్ల ఆదాయంపై రూ.355.68 కోట్ల నికర లాభాన్ని గడించింది. సంస్థ జూలై నుంచి జూన్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా వ్యవహరిస్తున్నది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర రూ.5,519.15 వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

