iPhone 15 | రూ.26,999కే ఐఫోన్ 15.. ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్..!
iPhone 15 | . గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 15 (128GB)పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఊహించని డీల్‌ను ప్రకటించింది. రూ.69,990 విలువైన ఈ ఫోన్‌ను రూ.27వేలకే అందిస్తోంది.
iPhone 15 | ఐఫోన్ (iPhone).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అయితే, ఆ కలలు అందరికీ నెరవేరవు. అందుకు కారణం సాధారణ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ధరలు చాలా ఎక్కువగా ఉండడమే. దీంతో కొందరు బెస్ట్ డిస్కౌంట్స్ కోసం ఎదురుచూసి వాటిని సొంతం చేసుకుంటుంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 15 (128GB)పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఊహించని డీల్‌ను ప్రకటించింది. రూ.69,990 విలువైన ఈ ఫోన్‌ను రూ.27వేలకే అందిస్తోంది.
సాధారణంగా iPhone 15 128GB ధర రూ.69,990. ఈ ప్రీమియం డివైజ్ ఇప్పుడు పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కలుపుకుని కేవలం రూ. 26,999కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్లో గరిష్ఠంగా రూ.31,500 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. అందుకోసం మనం ఐఫోన్ 14ను ఎక్స్ఛేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 26,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ మినహాయింపుతో అయితే గరిష్ఠంగా 16 శాతం తగ్గింపుతో రూ.58,499కు ఫోన్ లభిస్తోంది.
అంతేకాదండోయ్.. దీనిపై ఫ్లిప్‌కార్ట్ ‘మినిట్స్’ డెలివరీ సేవను కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రదేశాల్లో కేవలం 14 నిమిషాల్లోనే ఈ ఫోన్‌ను డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇందుకోసం అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 20 నుంచి 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. నేటితో ఈ ఆఫర్ ముగియనుంది.
ఐఫోన్ 15 గతేడాది (2023) సెప్టెంబర్లోలో విడుదలైన విషయం తెలిసిందే. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో రంగుల్లో లభిస్తుందీ ఫోన్. ఐఓఎస్ 17 వర్షన్‌పై పని చేస్తున్న ఐ-ఫోన్ 15 ఫోన్.. ఆపిల్ ఏ16 బయోనిక్ చిప్ కలిగి ఉంటుంది. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ స్క్రీన్, డైనమిక్ ఐలాండ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
Also Read..
Taxpayer | ఈ ఏడాది అత్యధిక ట్యాక్స్ పే చేసిన క్రికెటర్ ఎవరో తెలుసా..?
Donald Trump | రేపిస్టులు, హంతకులను క్షమించేది లేదు.. వారికి మరణ శిక్షే : డొనాల్డ్ ట్రంప్
Arvind Kejriwal | త్వరలో ఢిల్లీ సీఎం అతిశీని అరెస్ట్ చేస్తారు : అరవింద్ కేజ్రీవాల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

