Gautam Adani | ఆసియా, భారత్ కుబేరుడు గౌతం అదానీ వ్యక్తిగత సంపద శుక్రవారం భారీగా నష్టపోయారు. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఏడో స్థానానికి పడిపోయారు. ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన వ్యక్తిగత సంపద దాదాపు 22.5 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయి 96.8 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడింది. ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ తర్వాతీ స్థానానికి గౌతం అదానీ పడిపోయారు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ వ్యక్తిగత సంపద 104.1 బిలియన్ డాలర్లు.
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో బిగ్ ర్యాలీ నమోదు కావడంతో ప్రపంచ కుబేరుల్లో గౌతం అదానీ రెండో స్థానానికి చేరుకున్నారు. సుదీర్ఘకాలం రెండో స్థానంలో కొనసాగిన గౌతం అదానీని అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 122 బిలియన్ డాలర్లతో ఇటీవలే క్రాస్ చేశారు.
లగ్జరీ వస్తువుల సంస్థ లూయిస్ విట్టోన్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్, ఆయన కుటుంబం వ్యక్తిగత సంపద 216.1 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద కుబేర కుటుంబంగా నిలిచింది. తర్వాతీ స్థానంలో టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ వంటి సైట్లకు సారధ్యం వహిస్తున్న ఎలన్‌మస్క్ 170.1 బిలియన్ డాలర్లు.
ఇక దేశంలో గౌతం అదానీకి పోటీదారుగా ఉన్న రిలయన్స్ అధినేత సారధి ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 83.6 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో నిలిచింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ ర్యాంకుకు పడిపోయారు. గత రెండు సెషన్లలో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు 20 శాతం వరకు పతనం కావడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద పడిపోయింది.