Gautam Adani : ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అంతేకాదు.. మరో భారతీయ వ్యాపారవేత్త ముకేష్ అంబానీని దాటి ఆయన ఈ స్థానం సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన టాప్ 20 జాబితాను బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసింది. ఈ 20 మందిలో ఇండియా నుంచి ఇద్దరు ఉన్నారు. అది గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీ. మిగతా వారిలో ఫ్రాన్స్ నుంచి ఒకరు, స్పెయిన్ నుంచి మరొకరు, మెక్సికో నుంచి ఇంకొకరు ఉన్నారు.
ఈ ఐదుగురు మినహా టాప్ 20లో మిగతా 15 మంది అమెరికన్లే ఉండటం విశేషం. ఎప్పట్లాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎక్స్, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ నిలిచారు. ఈ జాబితాలో గౌతమ్ అదానీ 19వ స్థానంలో, అంబానీ 20వ స్థానంలో ఉన్నారు. అంబానీ సంపద విలువ 92.6 బిలియన్ డాలర్లు. ఆయన సంపద 8.10 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆ తర్వాత స్థానంలో 90.8 బిలియన్ డాలర్లతో అంబానీ నిలిచారు. ఆయన సంపద 16.9 బిలియన్ డాలర్లు తగ్గింది. వారెన్ బఫెట్, బిల్గేట్స్, లారి ఎల్లిసన్ల ఆదాయం తగ్గి, స్థానాలు దిగాజారారు. టాప్ 20 జాబితా ఇది.
ఎలాన్ మస్క్ (626 బిలియన్ డాలర్లు), లారీ పేజ్ (286 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (269 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (266 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్ బర్గ్ ( 239 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్ ( 230 బిలియన్ డాలర్లు), మైకేల్ డెల్ ( 170 బిలియన్ డాలర్లు), జెన్సన్ హాంగ్ ( 164 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ ( 164 బిలియన్ డాలర్లు), జిమ్ వాల్టన్ ( 150 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మర్ ( 148 బిలియన్ డాలర్లు), రాబ్ వాల్టన్ ( 147 బిలియన్ డాలర్లు), అలైస్ వాల్టన్ ( 146 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ ( 142 బిలియన్ డాలర్లు), కార్లోస్ స్లిమ్ ( 130 బిలియన్ డాలర్లు), అమాన్సియో ఓర్టెగా ( 130 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్ ( 104 బిలియన్ డాలర్లు), థామస్ పీటర్ఫై ( 93.8 బిలియన్ డాలర్లు), గౌతమ్ అదానీ ( 92.6 బిలియన్ డాలర్లు), ముఖేష్ అంబానీ ( 90.8 బిలియన్ డాలర్లు).