హైదరాబాద్, జనవరి 12: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జీ స్కేర్.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్న తమ జీ స్కేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటి కస్టమర్ల కోసం ‘సంక్రాంతి సంబరాలు’ పేరుతో ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ నెల 11 నుంచి 22 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ల కాలంలో ఇంటిగ్రేటెడ్ సిటీని సందర్శించిన వినియోగదారులు కార్లు, బైకులను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అలాగే రోజూ 100 బంగారు నాణేలను కూడా గెల్చుకోవచ్చని గురువారం ఓ ప్రకటనలో సంస్థ స్పష్టం చేసింది. ప్లాట్ బుకింగ్‌పై హాంకాంగ్, మలేషియా, సింగపూర్ లేదా దుబాయ్ ట్రిప్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీన్ని వద్దనుకుంటే 40 గ్రాముల బంగారాన్ని తీసుకోవచ్చు. చీరలు, టీషర్ట్‌ల రూపంలో ప్రత్యేక బహుమతులూ ఉన్నాయి.